ఆ రోజు నుండీ ఆహాలో ‘మంచి రోజులు….’!

సంతోశ్ శోభ‌న్‌, మెహ‌రీన్ జంట‌గా మారుతి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ‘మంచి రోజులు వ‌చ్చాయి’ మూవీ నవంబర్ 4న థియేటర్లలో విడుదలైంది. రొమాంటిక్‌, కామెడీ, ఎమోష‌న్స్… ఇలా అన్నీ ఎలిమెంట్స్ ను కలగలిపి మారుతీ ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీ కథ గురించి నిర్మాత ఎస్.కె.ఎన్. మాట్లాడుతూ, ”పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగులైన సంతోశ్‌, ప‌ద్మ ప్రేమించుకుంటారు. పెళ్లి చేసుకోవాల‌నుకుంటారు. అదే స‌మ‌యంలో ఇండియాలో పాండమిక్ సిట్యుయేషన్ మొదలవుతుంది. ఆ కార‌ణంగా వారిద్ద‌రూ స్వ‌స్థ‌లం హైద‌రాబాద్ చేరుకుంటారు. ప‌ద్మ తండ్రి గోపాలంకు త‌న కూతురంటే అమిత‌మైన ప్రేమ. త‌న కూతురు మరో అబ్బాయితో ప్రేమ‌లో ఉంద‌నే విష‌యం గోపాలంకు తెలుస్తుంది. దాన్ని ఆయ‌న వ్య‌తిరేకిస్తాడు. సాధార‌ణంగా గోపాలం భ‌య‌స్థుడు. దాన్ని అలుసుగా తీసుకుని చుట్టూ ఉన్న వారి చిన్న చిన్న విష‌యాల‌కే ఆయ‌న్ని భ‌య‌పెడుతుంటారు.

Read Also : రాజ్ కుంద్రాకు షాక్… మళ్ళీ పెరుగుతున్న కష్టాలు

ఆ కార‌ణంగా ఆయ‌న‌లో భ‌యం ఇంకా పెరుగుతుందే కానీ, త‌గ్గ‌దు. అలాంటి భ‌యంతో కూతురి ప్రేమ‌ను ఆయ‌న ఒప్పుకోడు. సంతోశ్ కంటే మంచి సంబంధం తీసుకొచ్చి కూతురికి పెళ్లి చేయాల‌నుకుంటాడు. ఈ క్ర‌మంలో గోపాలం త‌నలోని భ‌యాల‌ను ఎలా అధిగ‌మిస్తాడు? గోపాలం ఫ్యామిలీకి సంతోశ్ ఎలా స‌పోర్ట్‌గా నిలుస్తాడు? సంతోశ్‌, ప‌ద్మ ప్రేమ‌ను గోపాలం అర్థం చేసుకుంటాడా? అనే ప్రశ్నలకు సమాధానమే ‘మంచి రోజులు వచ్చాయి” అని అన్నారు. ఈ సినిమాను డిసెంబర్ 3న ఆహాలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అజ‌య్ ఘోష్‌, ‘వెన్నెల’ కిషోర్‌, స‌ప్త‌గిరి, వైవా హ‌ర్ష‌, శ్రీనివాస్ రెడ్డి, సుద‌ర్శ‌న్‌, ప్ర‌వీణ్ వంటి న‌టీన‌టులు ఇందులో కీలక పాత్రలు పోషించారు.

Related Articles

Latest Articles