సౌత్ ఇండియాలోనే.. ‘బెస్ట్ పవర్ ప్లాంట్ పెర్ఫార్మర్’

మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద నిర్మించిన 1200 మెగావాట్ల సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ కు అరుదైన ఘనత దక్కింది. జాతీయ స్థాయిలో జైపూర్ ఎస్టీపీపీ ‘బెస్ట్ థర్మల్ పవర్ ప్లాంట్ పెర్ఫార్మర్’ అవార్డు దక్కించుకుంది. జాతీయ స్థాయిలో విద్యుత్ వినియోగం, విద్యుత్ పరిశ్రమల్లో ఆధునిక శాస్త్ర పరిజ్ఞానం, మొదలైన విషయాలపై మిషన్ ఎనర్జీ ఫౌండేషన్ అనే ముంబైకి చెందిన సంస్థ శుక్రవారం నిర్వహించిన వీడియో సెమినారులో ఈ అవార్డు ప్రకటించారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ సదస్సులో దేశవ్యాప్తంగా గల సుమారు 525 విద్యుత్తు సంస్థలకు సంబంధించిన ప్రతినిధులు పాల్గొన్నారు. దక్షిణ భారతదేశంలో 500 మెగావాట్లు, అంతకన్నా ఎక్కువ సామర్థ్యం గల ధర్మల్ విద్యుత్ కేంద్రాలలో సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం అత్యుత్తమ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విభాగంలో బెస్ట్ ప్లాంట్ పెర్ఫార్మర్‌గా ఎంపికైంది. ఎస్‌సీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.శ్రీధర్ ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. ఎస్‌టీపీపీ అధికారులు, సిబ్బందికి అభినంద‌న‌లు తెలిపారు. ఇదే స్ఫూర్తితో పనిని కొనసాగించాలని కోరారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-