సింగరేణి బొగ్గు లారీలకు జరిమానా విధించిన పోలీసులు

మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందారం గ్రామం శివారులో జైపూర్ ఎస్సై రామకృష్ణ తన సిబ్బందితో వాహనాల తనిఖీలు చేపట్టారు. ఇందారం IK-1A ఓపెన్ కాస్ట్ మైన్ నుంచి బొగ్గు తీసుకెళ్తున్న లారీలను తనిఖీలు చేశారు. ఎలాంటి టార్పాలిన్లు కట్టకుండా మరియు అతివేగంగా వెళ్తున్న 8 లారీలకు రూ.10,400 జరిమానా విధించారు. అయితే గతంలోనూ చాలా సందర్భాల్లో హెచ్చరించిన వినకపోవడంతో ఫైన్ వేశారు. ఇక నుండి టార్పాలిన్ కట్టకుండా, అతి వేగంగా నడిపి ప్రమాదాలకు కారణం అయితే కేసు నమోదు చేసి సీజ్ చేయడం జరుగుతుందని లారీ యజమానులను & డ్రైవర్లను ఎస్సై రామకృష్ణ హెచ్చరించారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-