అక్కాచెల్లెళ్లను పెళ్లి చేసుకున్న వరుడు అరెస్ట్

కర్ణాటకలోని కోలార్​లో అక్కాచెల్లెళ్లిద్దరినీ వివాహమాడి వార్తల్లోకెక్కిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్​ చేశారు. ఈ ఘటనలో వరుడు ఉమాపతితో సహా.. మరో ఏడుగురిపై కేసు నమోదు చేశారు. 31 ఏండ్ల ఉమాపతి.. మూగ, వినికిడి సమస్యలతో బాధపడుతున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లను (సుప్రియ, లలిత) వివాహమాడాడు. తన కూతుళ్లకు వేరుగా పెళ్లి చేస్తే.. ఇబ్బందులను ఎదుర్కొంటారని భావించిన తండ్రి.. వయసు గురించి ఆలోచించకుండా ఇరువురికీ ఒకే వరుడినిచ్చి కట్టబెట్టాడు. కాగా ఈ విష‌యం సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ కావ‌డంతో పోలీసుల దాకా చేరింది. సుప్రియ సోద‌రి వ‌య‌సు 16 ఏండ్లు కావ‌డంతో.. పెళ్లి చేసుకున్న యువ‌కుడితో పాటు అత‌ని కుటుంబ స‌భ్యుల‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు. నూత‌న వ‌రుడు ఉమాప‌తిని పోలీసులు అరెస్టు చేశారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-