పాతికేళ్ల కుర్రాడితో ఆంటీ ఎఫైర్.. పెళ్లి వద్దు అనడంతో

వివాహేతర సంబంధాలు పచ్చని కుటుంబాలలో చిచ్చు పెడుతున్నాయి. పరాయి వాళ్ళ మీద మోజు ఎంతటి నీచానికైనా దిగజారేలా చేస్తోంది. చివరికి హత్య చేయడానికైనా వెనుకాడడు. తాజాగా ఇలాంటి ఒక సంఘటనే తమిళనాడులో వెలుగుచూసింది. రెండు రోజుల క్రితం బావిలో శవంగా తేలిన ఒక మహిళ కేసును పోలీసులు చేధించారు. ఆమె కావాలని ఆత్మహత్య చేసుకోలేదని, ఆమె ప్రియుడే ఆమెను హతమార్చి బావిలో పడేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

నమక్కల్ సమీపంలోని ఓ గ్రామంలో లలిత(45) అనే మహిళా నివసిస్తోంది. ఆమె భర్త కొన్నేళ్ల క్రితం మృతి చెందడంతో ఒంటరిగా చేపలు అమ్ముతూ జీవిస్తోంది. ఇక అదే గ్రామానికి చెందిన సురేందర్(25) ఎంసిఎ చదివి ఖాళీగా ఉంటున్నాడు. లలిత దుకాణం వద్దే సురేందర్ తండ్రి కిరాణా షాపు ఉండడంతో నిత్యం షాప్ కి వచ్చేవాడు. అలా లలితకు, సురేందర్ కి పరిచయం ఏర్పడింది. కొద్దీ రోజులకే ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీంతో ఎక్కువగా సురేందర్, లలిత ఇంట్లోనే ఉండేవాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న సురేందర్ తల్లిదండ్రులు అతడిని మందలించి వేరొక అమ్మాయితో పెళ్లి చేయడానికి సిద్ధపడ్డారు.

ఇక ఈ విషయం తెలుసుకున్న లలిత, ప్రియుడు సురేందర్ ని తనను పెళ్లి చేసుకోమని కోరగా సురేందర్ నిరాకరించాడు. దీంతో వీరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఎంతకీ లలిత మాట వినకపోవడంతో ఆమెను హతమార్చి దగ్గర్లోనే బావిలో పడేశాడు సురేందర్. పోలీసులు లలిత కేసులో విచారణలో భాగంగా సురేందర్‌ను అనుమానితుడిగా అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం నిందితుడిని దుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.

Related Articles

Latest Articles