దారుణం: జైల్లో.. అంతమంది పోలీసుల మధ్య కూతురిపై తండ్రి అత్యాచారం.. ఆ తరువాత

రాజస్థాన్ ఓపెన్ జైల్లో దారుణం చోటుచేసుకొంది. అంతమంది పోలీసులు చూస్తుండగా.. ఒక నిందితుడు తన కూతురుపై అఘాయిత్యని పాల్పడి పరారయ్యిన ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. వివరాల్లోకి వెళితే సిరోహి జిల్లాకు చెందిన ఒక వ్యక్తి హత్య కేసులో నిందితుడిగా తేలడంతో అతడిని రాజస్థాన్ ప్రిజనర్స్ ఓపెన్ ఎయిర్ క్యాంపస్ కి తరలించారు. ఈ క్యాంపస్ రూల్స్ ప్రకారం జైల్లోనే నిందితుడు కుటుంబంతో కలిసి ఉండొచ్చు. దీంతో సదరు నిందితుడు కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. అయితే పుట్టుకతో వచ్చిన బుద్ది పుడకలతో గానీ పోదు అన్నట్టు.. జైల్లో ఉన్నా కూడా అతడి బుద్ది మాత్రం మారలేదు. చీటికిమాటికి భార్యను వేధించడం, కూతుర్ని హింసించడం మొదలుపెట్టాడు.

భర్త వేధింపులు తట్టుకోలేని భార్య.. కూతుర్ని వదిలిపెట్టి పుట్టింటికి వెళ్ళిపోయింది. దీంతో అతడి కన్ను కూతురు పై పడింది. అది జైలు అని కానీ, చుట్టూ పోలీసులు ఉన్నారని కానీ భయపడకుండా నీచానికి ఒడిగట్టాడు. కన్నకూతురిపై అత్యచారానికి పాల్పడ్డాడు. అనంతరం పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు. ఇక ఈ విషయాన్ని బాలిక తల్లికి తెలుపడంతో ఇద్దరు కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడికోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

Related Articles

Latest Articles