కరోనా పాజిటివ్… భయమేసి యువకుడు సూసైడ్

కరోనా సెకండ్ వేవ్ మరోసారి గతంలో నెలకొన్న పరిస్థితులను గుర్తు చేస్తోంది. కరోనా వైరస్ భయంతో గతంలో చాలామంది ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా మళ్లీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు నెలకొంటున్నాయి.  కరోనా సోకిందన్న భయంతో పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పెదవేగి మండలం నడిపల్లి గ్రామానికి  చెందిన షేక్ విలాయత్ అనే యువకుడికి కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతను గుంటూరు స్పిన్నింగ్ మిల్ లో పనిచేస్తూ నిన్న రాత్రి సొంత గ్రామమైన పెదవేగి మండలం నడిపల్లి కి వచ్చాడు. ఈ రోజు ఉదయం ఫోన్ రావడం తో ఇంటి నుండి బయటకు వెళ్ళాడని ఎంతకీ రాకపోవడంతో పలు మార్లు ఫోన్ చేయగా తనకి పాజిటివ్ వచ్చిందని తెలిసిందని వియరాయి ప్యాక్టరీ వద్ద  పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు తల్లిదండ్రులకు చెప్పి ఫోన్ కట్ చేశాడని సమాచారం. అయితే వెంటనే ఆ ప్రాంతానికి వెళ్ళి చూడగా అప్పటికే మృతి చెందాడని యువకుడి తండ్రి తెలిపారు.

-Advertisement-కరోనా పాజిటివ్... భయమేసి యువకుడు సూసైడ్

Related Articles

Latest Articles