భార్య పుట్టింటికి వెళ్లిందని మనస్తాపంతో భర్త ఆత్మహత్య..

రాజేంద్రనగర్ కిస్మత్ పూర్ లో విషాదం చోటు చేసుకుంది. భార్య తనతో గొడవ పడి పుట్టింటికి వెళ్లిందని మనస్తాపం తో ఆత్మహత్య చేసుకున్నాడు శ్రీకాంత్ అనే వ్యక్తి. ఇంట్లో తన గది లో ఫ్యాన్ కు తాడుతో ఉరి వేసుకొని బలవన్మరణంకు పాల్పడ్డాడు శ్రీకాంత్.
ఉదయం ఎంతకీ శ్రీకాంత్ ఇంట్లో నుండి బయటకు రాకపోవడంతో అనుమానం తో కిటికీ తెరచి చూసిన స్థానికులకు ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించాడు శ్రీకాంత్. వెంటనే రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. ఆ తర్వాత ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు. ఫ్యాన్ కు వేలాడుతున్న మృతదేహాన్ని కింద కు దింపి పోస్టు మార్టం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి… కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

మృతుడు రాజేంద్రనగర్ లోని డీఆర్ఆర్ లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నట్లు గుర్తించారు. గత మూడు సంవత్సరాల క్రితం కొండాపూర్ ప్రాంతానికి చెందిన నిఖిల తో వివాహం చేసుకున్నాడు శ్రీకాంత్. మూడు నెలలు సాఫీగా సాగిన సంసార జీవితంలో తర్వాత శ్రీకాంత్ మద్యానికి బానిసయ్యాడు. అప్పటి నుండి ఇద్దరి మద్య మనస్పర్థాలు వచ్చాయి. త్రాగుడు మానేయాలని భర్తతో కోరింది భార్య. కానీ త్రాగుడు మానక పోవడంతో ఇద్దరి మద్య చెలరేగిన గొడవలు… తరచూ మద్యం విషయంలో లో వాగ్వాదం… అయిన ఎంతకీ తన ప్రవర్తన లో మార్పు రాకపోవడంతో గత సంవత్సరం భర్త శ్రీకాంత్ ను వదలి పుట్టింటికి వెళ్ళింది నిఖిల. అప్పటి నుండి ఒంటరిగా ఉంటున్న శ్రీకాంత్… నేను ఒంటరి ని అయిపోయానని కృంగి పోయిన తన గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు పోలీసులు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-