ఉపాధికోసం సిటీకి వచ్చిన యువకుడు.. ఆరునెలల తరువాత భార్యకోసం వెళ్తే

ఆ యుకుడికి కొత్తగా పెళ్లైంది.. పెళ్లి తరువాత భార్యను బాగా చూసుకోవాలనుకొని అనుకున్నాడు. దానికోసం ఉపాధి వెతుకుంటూ భార్యను వదిలి సిటీకి చేరుకున్నాడు. ఏదోవిధంగా డబ్బు కూడబెట్టి ఆరునెలల తరువాత ఇంటికి చేరుకున్నాడు. కానీ, అక్కడ భార్య కనిపించలేదు.. ఆమె పుట్టింటికి వెళ్లి కాపురానికి రమ్మని అడిగాడు.. ఆమె షాకింగ్ ఆన్సర్ ఇవ్వడంతో కుంగిపోయాడు. భార్య అన్న మాటలకు మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు.. ఈ దారుణ ఘటన జార్ఖండ్‌లో వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళితే.. ఛత్రా జిల్లాకు చెందిన జితేంద్ర దాస్‌(25) కు ఆరునెలల కిర్తం వివాహమైంది. భార్యను ఆనందంగా చూసుకోవడం కోసం డబ్బు కావాలనుకున్న యువకుడు.. భార్యను అత్తవారింట్లో వదిలి పెళ్ళైన వారం రోజులకే సిటీకి వెళ్లాడు. ఆరునెలలు ఏదో చిన్నపనులు చేసుకుంటూ కొద్దిగా డబ్బు కూడబెట్టి భార్యకు సొంత ఊరు వెళ్ళాడు. కానీ అక్కడ తనిఖీ అనుకోని షాక్ తగిలింది. భార్య వాళ్ళింట్లో కాకుండా పుట్టింట్లోనే ఉంటుందని తెలిసి ఖంగుతిన్నాడు. సరేనని అక్కడికి వెళ్లి ఆమెను కాపురానికి రావాల్సిందిగా కోరాడు. కానీ , భార్య మాత్రం తనతో రావడం ఇష్టం లేదని, తాను ఇక్కడే ఉంటానని తెగేసి చెప్పడంతో యువకుడు మనస్థాపం చెందాడు. భార్య మాటలతో మనోవేదనకు గురైన అతడు శనివారం ఉదయం విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Related Articles

Latest Articles