వ్యాక్సిన్ 2 డోసులు పూర్తి.. అయ‌స్కాంతంగా మారిపోయిన శ‌రీరం..!

క‌రోనా మ‌హ‌మ్మారిని క‌ట్ట‌డి చేయ‌డానికి ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేష‌న్.. మొద‌ట‌ల్లో వ్యాక్సిన్ అంటేనే వ‌ణికిపోయిన ప్ర‌జ‌లు.. ఇప్పుడు క్ర‌మంగా ఫ‌స్ట్ డోస్‌, సెకండ్ డోస్‌కు క్యూ క‌డుతున్నారు.. అయితే, వ్యాక్సిన్ వేయించుకున్న‌వారిలో ర‌క‌రాల మార్పులు క‌నిపిస్తున్నాయి.. కొంద‌రికి జ్వ‌రం, ఒంటినొప్పులు, ద‌గ్గు లాంటి ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డుతున్నాయి.. వ్యాక్సిన్ వేయించుకున్న ఓ వ్య‌క్తి.. ఆయ‌న వ్యాక్సిన్ తీసుకున్న ప్రాంతంలో బ‌ల్బు పెడితే.. ఏదో హోల్డ‌ర్‌లో పెట్టిన‌ట్టు వెలిగిపోయిన వీడియో ఈ మ‌ధ్య వైర‌ల్ కాగా.. ఇప్పుడు రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్న ఓ వ్య‌క్తి బాడీ మొత్తం అయ‌స్కాంతంగా మారిపోయింది..

పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. నాసిక్‌ చెందిన అరవింద్‌ సోనార్‌ అనే 71 ఏళ్ల వ్యక్తి.. స్థానికంగా ఉన్న ఆస్ప‌త్రిలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు.. ఆ త‌ర్వాత ఆయ‌న బాడీ అయస్కాంతంలాగా మారిపోయింది. ఆయ‌న శ‌రీరానికి ఇనుప వస్తువులను, కాయిన్స్‌ను, చెంచాలు.. ఇలా ఏవీ పెట్టినా.. అయస్కాంతంలా ఆక‌ర్షిస్తోంది. ఇప్పుడు ఈ వీడియో కాస్త సోష‌ల్ మీడియాకు ఎక్కి వైర‌ల్‌గా మారిపోయింది.. అయితే, ఈ ఘ‌ట‌న‌పై స్పందించిన జిల్లా మెడికల్‌ అధికారులు.. ఈ విషయంపై విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు. కాగా, ఈ విషయంపై సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) తన వెబ్‌సైట్‌లో వ్యాక్సిన్‌ను తీసుకున్న వారి శరీరం ఎలాంటి అయస్కాంత పదార్థాలుగా మారదని స్ప‌ష్టం చేసింది. మ‌రి అర‌వింద్ సోనార్ శ‌రీరంలో ఏముందో తెలియాల్సి ఉంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-