భ‌వానీపూర్‌లో దూసుకుపోతున్న దీదీ…

సెప్టెంబ‌ర్ 30 వ తేదీన ప‌శ్చిమ బెంగాల్‌లోని భ‌వానీపూర్ నియోజ‌క వ‌ర్గానికి ఉప ఎన్నిక జ‌రిగింది.  ఈ ఉప ఎన్నిక‌లో ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ పోటీ చేశారు.  బీజేపీ నుంచి ప్రియాంక టిబ్రేవాల్ పోటీ చేసిన సంగ‌తి తెలిసిందే.  ఈ ఉప ఎన్నిక‌కు సంబంధించి కౌంటిగ్ జ‌రుగుతున్న‌ది.  తాజా స‌మాచారం ప్ర‌కారం తృణ‌మూల్ అధినేత్రి, ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ భారీ ఆధిక్యంలో దూసుకుపోతున్నారు.  12 రౌండ్లు ముగిసే స‌రికి మ‌మ‌తా బెన‌ర్జీ 35 వేల ఓట్ల మేజారిటీని సాధించిన‌ట్టు స‌మాచారం. మ‌మ‌త‌కు 12 రౌండ్ల‌లో 48,813 ఓట్లు రాగా, బీజేపీ అభ్య‌ర్థి ప్రియాంకకు 13,843 ఓట్లు పోల‌య్యాయి.  ఇక సీపీఐ అభ్య‌ర్ధికి కేవ‌లం 1655 ఓట్లు మాత్రమే పోల‌య్యాయి.  గెలుపు దిశ‌గా దీదీ దూసుకుపోతుండ‌టంతో  తృణ‌మూల్ కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు సంబ‌రాలు చేసుకుంటున్నారు.  

Read: పంజాబ్ ప‌రిణామాల‌పై ఆ ముఖ్య‌మంత్రులు కీల‌క వ్యాఖ్య‌లు…

-Advertisement-భ‌వానీపూర్‌లో దూసుకుపోతున్న దీదీ...

Related Articles

Latest Articles