ప్రధాని నరేంద్ర మోడీతో మమతాబెనర్జీ భేటీ


బెంగాల్ సీఎం మమతా బెనర్జీ త్రిపుర హింసాకాండ, బీఎస్ఎఫ్ అధికార పరిధి అంశాలను చర్చించడానికి ప్రధాని నరేంద్ర మోడీతో బుధవారం భేటీ అయ్యా రు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె.. రాష్ట్రంలో సంభవించిన ప్రకృతి వైపరీత్యాల కోసం కేంద్రం నుంచి రాష్ట్రానికి ఇంకా రూ.96,605 కోట్లు రావాల్సి ఉంది అన్నారు. అంతే కాకుండా బెంగాల్ BSF అధికార పరిధి గురించి మాట్లాడుతూ.. “BSFకు విస్తృత అధికారాలు ఇచ్చినట్లయితే అది శక్తిమంతం అవ్వడమే కాకుండా రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తెలిపారు.

బీఎస్ఎఫ్ విచక్షణారహితంగా కాల్పులు జరిపిన కూచ్ బెహార్ కేసును ప్రస్తావిస్తూ సీఎం మమతా బెనర్జీ ప్రధాని మోడీకి ఈ విషయం చెప్పా రు. దీని వల్ల అమాయకులు బలి అవుతున్నారని ఆమె వెల్లడించారు. ఇప్పటికైనా దీని పై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. ఇంకా ఆమె మాట్లాడుతూ.. ఈ సమస్యను గురించే ప్రముఖంగా చర్చించినట్టు పేర్కొన్నారు. భారతదేశ సమాఖ్య నిర్మాణానికి భంగం కలగకుండా చూసుకోవాలని ప్రధాని మోడీని అభ్యర్థించినట్టు మమతా బెనర్జీ తెలిపారు.

Related Articles

Latest Articles