వారందరూ నాకే ఓటు వేశారు : మమతా బెనర్జీ

ఈ రోజు పశ్చిమ బెంగాల్ లో భబానీపూర్‌ కు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇందులో అందరూ ఊహించినట్లే పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ ఘన విజయం సాధించారు. అనంతరం ఈ ఫలితాల పైన ఆవిడ స్పందిస్తూ… భబానీపూర్‌ లో దాదాపు 46 శాతం మంది బెంగాలీయేతరులు ఉన్నారు. వారందరూ నాకు ఓటు వేశారు. పశ్చిమ బెంగాల్ ప్రజలు భబానీపూర్ వైపు చూస్తున్నారు. ఇది నాకు స్ఫూర్తినిచ్చింది. పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు ప్రారంభమైనప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని అధికారం నుంచి తొలగించాలని కుట్రలు పన్నింది. కానీ మాకు ఓటు వేసినందుకు ప్రజలకు, 6 నెలల్లో ఎన్నికలు నిర్వహించినందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి కృతజ్ఞతలు తెలిపారు దీదీ. అయితే ఈ ఎన్నికలో దీదీ 58,389 ఓట్ల మెజారిటీతో విజ‌యం సాధించారు.

-Advertisement-వారందరూ నాకే ఓటు వేశారు : మమతా బెనర్జీ

Related Articles

Latest Articles