నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకోబోయిన నటి..?

ప్రముఖ మలయాళ నటి భామ ఆత్మహత్య చేసుకున్నాడని గత కొద్దీ రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. అధిక మోతాదులో నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందంటూ పుకార్లు పుట్టుకొచ్చాయి. 2017లోని వేధింపుల కేసును తిరిగి విచారిస్తుండ‌టంతో భ‌యాందోళ‌న‌కు లోనై ఇలాంటి చ‌ర్య‌కు పాల్పండిదంటూ చెప్పుకొస్తున్నారు. ఇక దీంతో ఈ వార్తలపై భామ స్పందించింది.

” గత కొన్నిరోజులుగా నా పేరుమీద కొన్ని పుకార్లు వస్తున్నాయి. అందులో ఎటువంటి నిజాలు లేవు. నా మీద చూపిస్తున్న మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు.. నేను, నా ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉన్నాం. దయచేసి ఇలాంటి వార్తలను నమ్మకండి” అంటూ చెప్పుకొచ్చింది. భామ.. నైవేద్యం సినిమాతో చిత్ర పరిశ్రమకు పరిచయమైంది. ఈ సినిమా తరువాత పలు సినిమాల్లో నటించి మెప్పిచ్చిన ఈ భామ అప్పట్లో లైంగిక వేధింపులను ఎదుర్కొని టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది. ఆ తర్వాత  2020 జ‌న‌వ‌రిలో వ్యాపార‌వేత్త అరుణ్‌ను పెళ్లి చేసుకుని సినిమాల‌కు బ్రేక్ చెప్పింది. ఆ మ‌రుస‌టి ఏడాది పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది.ఇక ఇటీవల కూతురు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన భామ గురించి ఇలాంటి వార్తలు రావడం బాధాకరం అని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

Latest Articles