ప్రముఖ నటుడు నెడుముడి వేణు కన్నుమూత

ప్రముఖ మలయాళ నటుడు నెడుముడి వేణు (73) సోమవారం ఉదయం కన్నుమూశారు. రంగస్థలం నుండి 1978లో చిత్రసీమలోకి అడుగుపెట్టిన నెడెముడి వేణు వివిధ భాషల్లో ఐదు వందలకు పైగా చిత్రాలలో నటించారు. వివిధ కేటగిరీలలో మూడు సార్లు జాతీయ అవార్డును ఆయన అందుకున్నారు. ఆ మధ్య కొవిడ్ 19 బారిన పడిన వేణు ఆదివారం అనారోగ్యంతో హాస్పిటల్ లో చేరారు. జ్ఞానశేఖరన్ ‘మొగముల్’ చిత్రంతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నెడుముడి వేణుకు శంకర్ దర్శకత్వం వహించిన ‘భారతీయుడు’, ‘అపరిచితుడు’ చిత్రాలు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.

దాదాపు 11 సంవత్సరాల తర్వాత నెడుముడి వేణు తమిళ చిత్రం ‘సర్వం తాళమయం’లో నటించాడు. అలానే ‘నవరస’ ఆంథాలజీలో ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన ఎపిసోడ్ లో చేశాడు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ‘ఇండియన్ -2’లోనూ నెడుముడి వేణు నటిస్తున్నాడు. అనువాద చిత్రాల ద్వారా తెలుగువారికీ సుపరిచితుడైన నెడుముడి వేణు మృతికి పలువురు సంతాపం తెలిపారు. నెడుముడి వేణు మంచి నటుడు మాత్రమే కాదు గొప్ప మానవతా వాది అని, ఆయనను డైరెక్ట్ చేసే అవకాశం తన భర్త సుందర్ కు కలిగిందని నటి ఖుష్బూ తెలిపారు.

-Advertisement-ప్రముఖ నటుడు నెడుముడి వేణు కన్నుమూత

Related Articles

Latest Articles