పుష్ప” కోసం విలన్ షాకింగ్ డెసిషన్…?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా రెండు భాగాలుగా వస్తుందని ప్రకటించారు. ఇక ఈ రెండు భాగాల బడ్జెట్ రూ.250 కోట్ల వరకు ఉంటుందట. మొదటి భాగం షూటింగ్ దాదాపు పూర్తయింది. ఇక ఈ మాస్ ఎంటర్ టైనర్ లో మాస్ ప్రేక్షకులను అలరించే అన్ని అంశాలు ఉంటాయట. ఇక ఇప్పటికే విడుదల చేసిన ‘ది ఇంట్రడక్షన్ ఆఫ్ పుష్పరాజ్’ వీడియో ఇంటర్నెట్ లో రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాను మైత్రీ మూవీస్ నిర్మిస్తుండగా… రశ్మిక హీరోయిన్ గా నటిస్తోంది. ఇక మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ ప్రతినాయకుడుగా సందడి చేయనున్న ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంగా తెరకెక్కుతోంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఫహద్ ఈ సినిమా కోసం తెలుగు నేర్చుకోవాలనే షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడట. తెలుగు ప్రేక్షకులకు దగ్గర కావడానికి, సినిమాలో తన పాత్రకు తగ్గట్టుగా రాయలసీమలోని చిత్తూరు యాస నేర్చుకుంటున్నట్టు చెబుతున్నారు. లాక్ డౌన్ సమయాన్ని ముఖ్యంగా తెలుగు నేర్చుకోవడం కోసమే వినియోగిస్తున్నాడట. ఈ వార్తలు గనుక నిజమైతే ఫహద్ “పుష్ప”లో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకునే అవకాశం ఉంది. కాగా రాబోయే రెండు నెలల్లో “పుష్ప” షూట్ తిరిగి ప్రారంభమవుతుంది. ఆ షెడ్యూల్ లో ప్రధాన పాత్రధారులు పాల్గొంటారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-