“ఎస్ఎస్ఎంబి28” హీరోయిన్ గా మలయాళీ బ్యూటీ ?

సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ ‘ఎస్ఎస్ఎంబి28’ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అయితే ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి కథ, హీరో పాత్ర, హీరోయిన్ పాత్రకు సంబంధించిన పలు పుకార్లు సోషల్ మీడియాలో షికార్లు చేస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా హీరోయిన్ రేసులో పూజాహెగ్డే, జాన్వీ కపూర్, దిశా పటానిల పేర్లు విన్పించాయి. తాజాగా ఈ జాబితాలో తమిళ హాట్ భామ పేరు తెరపైకి వచ్చింది. విజయ్ “మాస్టర్‌”లో నటించిన మలయాళీ బ్యూటీ మాళవిక మోహనన్ తో మేకర్స్ చర్చలు జరుపుతున్నారనేది తాజా సమాచారం. త్రివిక్రమ్ ఈ కథను త్వరలోనే ఈ యువ నటికి వివరిస్తారని, ఆ తరువాత నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఒకవేళ ఈ వార్తలు గనుక నిజమైతే భారీ అంచనాలతో తెరకెక్కనున్న “ఎస్‌ఎస్‌ఎమ్‌బి 28” చిత్రం మాళవికకు తెలుగులో మొదటి చిత్రం అవుతుంది. మొదటి చిత్రంలోనే మహేష్ తో కలిసి నటించే అవకాశం మాళవికను వరిస్తుందో లేదో చూడాలి. మహేష్ బాబు “సర్కారు వారి పాట”ను పూర్తి చేసిన వెంటనే “ఎస్ఎస్ఎంబి 28” షూటింగ్ ప్రారంభించాలని ఆలోచిస్తున్నాడు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-