‘అత్యుత్తమ శ్రీమతి’… గోవాలో మలైకా!

బాలీవుడ్ 40 ప్లస్ బ్యూటీస్ లో అందరికంటే టాప్ లో ఉంటుంది హాటీ మలైకా అరోరా! ఆమెని చూసి టీనేజ్ గాళ్స్ కూడా కుళ్లుకుంటారు. ఇక తనకి సల్మాన్ తమ్ముడు అర్భాజ్ కారణంగా ఓ టీనేజ్ కొడుకు కూడా ఉన్నడనేది అందరికీ తెలిసిందే! మరోవైపు, ఇంకా అఫీషియల్ గా ఒప్పుకోకపోయినప్పటికీ యంగ్ హీరో అర్జున్ కపూర్ తో ప్రస్తుతం సీనియర్ బ్యూటీ పీకల్లోతు ప్రేమలో ఉంది. మరి ఈ అర్భాజ్ ఖాన్ ఎక్స్ వైఫ్ అండ్ అర్జున్ కపూర్ ఫ్యూచర్ వైఫ్… ‘మిసెస్ ఇండియా’ బ్యూటీ కాంపిటీషన్ లో జడ్జ్ గా వ్యవహారించటంలో ఆశ్చర్యమేముంది చెప్పండి?
మలైకా రీసెంట్ గా తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ అప్ డేట్ ప్రకటించింది. అక్టోబర్ 3న గోవాకి వస్తున్నానంటూ ఫాలోయర్స్ కి సమాచారం ఇచ్చింది. ఆమె ‘మిసెస్ ఇండియా క్వీన్’ అందాల పోటీల తాలూకు ఫైనల్ షోకి జడ్జ్ గా వ్యవహరించనుంది. నిజానికి ‘మిసెస్ ఇండియా క్వీన్’ బ్యూటీ పాజెంట్ మొదలయ్యేది సెప్టెంబర్ 29న. అక్టోబర్ 3తో అందాల పోటీలు ముగుస్తాయి. పోటీపడిన వారిలో అత్యుత్తమ శ్రీమతిని ఎంపిక చేసే గ్రాండ్ ఫినాలే అక్టోబర్ 3న గోవాలో జరుగుతుంది. చూడాలి మరి, మలైకా న్యాయ నిర్ణేతగా వ్యవహరించే మిసెస్ ఇండియా క్వీన్ అందాల కిరీటం ఎవరికి దక్కనుందో!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-