తెలంగాణలో మరో భారీ పెట్టుబడి..

తెలంగాణకు వరుసగా బడా కంపెనీలు క్యూ కడుతున్నాయి.. రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెడుతున్నాయి.. తాజాగా, రూ. 750 కోట్ల రూపాయల పెట్టుబడి రాష్ట్రంలో పెట్టేందుకు ముందుకు వచ్చింది మలబార్‌ గ్రూప్.. ఈ పెట్టుబడితో తెలంగాణలో గోల్డ్ డైమండ్ జ్యువలరీ తయారీ ఫ్యాక్టరీతో పాటు రిఫైనరీని ఏర్పాటు చేయనుంది మలబార్ గ్రూప్.. దీని ద్వారా రాష్ట్రంలోని 2500 మందికి పైగా నైపుణ్యం కలిగిన స్వర్ణకారులకు ఉపాధి అవకాశం లభించనుంది..

ఇక, ప్రభుత్వ పాలసీని మలబార్‌ గ్రూప్‌ అభినందించగా… ఆ గ్రూప్‌కి కృతజ్ఞతలు తెలిపారు మంత్రి కేటీఆర్.. తెలంగాణలో ఉన్న ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ వాతావరణం, ఇక్కడి ప్రభుత్వం పాలసీలను పరిగణలోకి తీసుకొని ఈ పెట్టుబడి నిర్ణయం తీసుకున్నామన్న మలబార్ గ్రూప్ ప్రతినిధులు వెల్లడించారు.. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్.. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిన మలబార్ గ్రూప్‌కి కృతజ్ఞతలు తెలిపారు.. మలబార్ గ్రూప్ కి అన్ని విధాలుగా సహాయం అందజేస్తామని హామీ ఇచ్చారు.. మలబార్ గ్రూప్ చైర్మన్ యంపీ అహ్మద్ బృందంతో హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్‌ సమాశం అయ్యారు.. ఆ సమావేశంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు.

Related Articles

Latest Articles

-Advertisement-