నేటి నుండి శ్రీశైలంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

నేటి నుండి శ్రీశైలంలోని శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి ఆలయంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. పంచాహ్నిక దీక్షలతో క్షేత్రపరిధిలో 7 రోజులపాటు వైభవంగా మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు జరుగనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రతి సంవత్సరం నిర్వహించిన విధంగానే ఎంతో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

స్వామివారి యగశాల ప్రవేశంతో సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టానున్నారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా సాయంత్రం ధ్వజారోహణం నిర్వహిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఉత్సవాల సందర్భంగా ఈనెల 18 వరకు రుద్రహోమం, చండీహోమం, స్వామి అమ్మవారి కళ్యాణం తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.

Related Articles

Latest Articles