హృదయాన్ని కట్టిపడేస్తున్న ‘మేజర్’ మొదటి సాంగ్ ప్రోమో

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో అడవి శేష్ హీరోగా శశి కిరణ్ తిక్క దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం మేజర్. మేజర్ ఉన్ని కృష్ణన్ బయోపిక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను  సోనీ పిక్చర్స్ ఇండియా, జీ.మహేష్ బాబు ఎంటర్ టైన్మెంట్, మరియు a+s మూవీస్ పతాకంపై  మహేష్ బాబు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక తాజాగా ఈ సినిమాలోని మొదటి పాట రిలీజ్ కి ముహూర్తం ఫిక్స్ చేశారు మేకర్స్.

‘హృదయమా’ అంటూ సాగే ఈ పాట ప్రోమోని తాజాగా రిలీజ్ చేసిన మేకర్స్ జనవరి 7 న పూర్తి సాంగ్ ని విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇక సాంగ్ పప్రోమో ఆద్యంతం ఆకట్టుకొంటుంది. శ్రీ చరణ్ పాకాల సంగీత సారథ్యంలో సిద్ శ్రీరామ్ మెస్మైరైజింగ్ వాయిస్ తో సాంగ్ అదిరిపోయింది. మనుసును హత్తుకునేలా కృష్ణ కాంత్ లిరిక్స్.. శేష్, సాయి మంజ్రేకర్ ల మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకొంటున్నాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఫిబ్రవరి 11 న విడుదల కానుంది. మరి ఈ సినిమాతో అడవి శేష్ మరో హిట్ ని అందుకుంటాడేమో చూడాలి.

Related Articles

Latest Articles