మరోసారి ‘మజిలీ’ కాంబో

‘మజిలీ’ వంటి హిట్ చిత్రాన్ని అందించిన నాగచైతన్య, శివ నిర్వాణ కలయికలో మరో మూవీ రానుందా! అంటే అవుననే వినిపిస్తోంది. ‘నిన్ను కోరి’ తో దర్శకుడైన శివ నిర్వాణ ఆ తర్వాత ‘మజిలీ’తోనూ హిట్ కొట్టి అందరి దృష్టిలో పడ్డాడు. నాని, విజయ్ దేవరకొండకు కథలు చెప్పి ఓకే చేసుకున్నాడు. నాని తో శివ తీసిన ‘టక్ జగదీష్’ ఇటీవల ఓటీటీలో విడుదలై డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దీంతో శివ నిర్వాణ తదుపరి సినిమా విజయ్ తో ఉండదనే టాక్ మొదలైంది. నిజానికి అటు విజయ్ తో పాటు శివ నిర్వాణ కూడా ‘టక్ జగదీష్’ తర్వాత తమ ప్రాజెక్ట్ ఉంటుందని చెబుతూ వచ్చారు. మైత్రీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లో మార్పులు చేర్పులు చోటు చేసుకోబోతున్నాయట. విజయ్ దేవరకొండ కాకుండా నాగచైతన్య హీరోగా ఈ సినిమా తెరకెక్కబోతోందట. ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ లపై దృష్టి పెట్టిన విజయ్ అందరూ అనుకుంటున్నట్లు శివ ప్రాజెక్ట్ చేయటం లేదట.

Read Also : ‘డాక్టర్ వరుణ్’ గా శివ కార్తికేయన్

శివ చెప్పిన కథ తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉంటుందట. అందుకే దానికి విజయ్ నో చెప్పాడని టాక్. అయితే ఈ కథను శివ నిర్వాణ ఇటీవల నాగచైతన్యకి వినిపించాడట. కథ ఆసక్తికరంగా ఉండటంతోపాటు తనకు ‘మజిలీ’ వంటి హిట్ ఇచ్చిన శివ నిర్వాణ మీద నమ్మకంతో గో హెడ్ చెప్పాడట చైతూ. అధికారిక ప్రకటనే తరువాయి అట. ప్రస్తుతం నాగచైతన్య మూడు సినిమాలు చేస్తున్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేసిన ‘లవ్ స్టోరీ’ 24న విడుదల అవుతోంది. ‘మనం’ ఫేమ్ విక్రమ్ కుమార్ తో చేస్తున్న ‘థాంక్యూ’ షూటింగ్ చివరి దశలో ఉంది. అలాగే నాగార్జునతో కలిసి ‘బంగార్రాజు’లో నటిస్తున్నాడు చైతన్య. వీటన్నింటి తర్వాత శివ నిర్వాణ సినిమా చేస్తాడట నాగచైతన్య.

-Advertisement-మరోసారి 'మజిలీ' కాంబో

Related Articles

Latest Articles