నమ్రతతో మంజుల ఎలా ఉంటారో తెలుసా ?

సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ తో ఆయన సోదరి మంజుల ఘట్టమనేని ఎలా ఉంటారో తెలుసుకోవాలనే ఆసక్తి చాలా మందికి ఉండే ఉంటుంది. ఈ వదిన మరదళ్ళు రియల్ లైఫ్ లో తమ బంధంలో ఎలా ఉంటారో తెలుపుతూ మంజుల ఒక పిక్ ను షేర్ చేశారు. “నేను నమ్రతతో నా సమయాన్ని ఆస్వాదిస్తాను. ఆమె నా వదిన మాత్రమే కాదు, మంచి స్నేహితురాలు కూడా. ఈ సూపర్ వుమన్ నుండి నేర్చుకోవలసినది చాలా ఉంది” అంటూ నమ్రతపై ప్రశంసల వర్షం కురిపించింది మంజుల. మంజుల చేసిన ఈ ట్వీట్ ను సూపర్ స్టార్ అభిమానులు భారీగా షేర్ చేసుకుంటున్నారు. ఇక సినిమాల విషయైకొస్తే మంజుల వెబ్-సిరీస్‌ను నిర్మస్తున్నట్లు తెలుస్తోంది. కరోనా మహమ్మారి కారణంగా ఇది ఆలస్యం అయింది. మరోవైపు మహేష్ బాబు “సర్కారు వారి పాట” చిత్రంతో పాటు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించనున్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-