పవన్, ఎన్టీఆర్, మహేష్ ఒకే ఫ్రేమ్ లో ?

జెమినీ టీవీలో ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. నిన్న ఈ షోలో ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా, మహేష్ బాబు అతిథిగా పాల్గొన్న ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. అయితే ఇది నిన్నటి వార్తే కానీ తాజా అప్డేట్ ఏమిటంటే ఈ సూపర్ ఎపిసోడ్ లో ఒకే ఫ్రేమ్ లో ముగ్గురు సూపర్ స్టార్స్ కన్పించబోతున్నారట. “ఎవరు మీలో కోటీశ్వరులు” షోలో ఫ్రెండ్ లైఫ్ లైన్ అనే ఆప్షన్ లో మహేష్ బాబు పవన్ కళ్యాణ్ తో వీడియో కాల్ మాట్లాడతాడని టాక్ నడుస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో “ఎవరు మీలో కోటీశ్వరులు”ను ముగ్గురి ఫ్యాన్స్ కలిసి ట్రెండ్ చేస్తున్నారు.

Read Also : “పుష్ప”రాజ్ ట్రైలర్ లోడింగ్… ప్రోగ్రెస్ లో పనులు

ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ స్పెషల్ ఎపిసోడ్ డిసెంబర్ 2వ తేదీన ప్రీమియర్‌ కానుంది. ఈ విషయాన్నీ త్వరలోనే ప్రకటించనున్నారు. ఇప్పటికే తారక్‌, మహేష్‌ల మధ్య కుదిరిన స్నేహబంధం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సూపర్ స్పెషల్ ఎపిసోడ్‌పై అంచనాలు అనూహ్యంగా ఉన్నాయి. ఇది “ఎవరు మీలో కోటీశ్వరులు” చివరి ఎపిసోడ్ అని కూడా వినికిడి. అయితే దీని గురించి ఎటువంటి అధికారిక ప్రకటన లేదు.

Related Articles

Latest Articles