ప్రభాస్ మూవీ షూటింగ్ లో… మహేశ్ బ్యూటీ!

‘వన్’ సినిమాతో తెలుగు కుర్రాళ్లను కలవర పెట్టిన వన్నెలాడి… కృతీ సనన్. తరువాత పెద్దగా తెలుగు చిత్రాలు చేయనప్పటికీ ‘వన్’ బ్యూటీ ఇప్పుడు బాలీవుడ్ లో నంబర్ వన్ అయ్యేందుకు తీవ్రంగా కష్టపడుతోంది. ఆమె చేతి నిండా సినిమాలు ఉండటంతో ఒకేసారి మూడు, నాలుగు చిత్రాల షూటింగ్స్ లో పాల్గొంటూ హడావిడి చేస్తోంది. తాజాగా కృతీ ‘ఆదిపురుష్’ సెట్స్ పై కాలుమోపింది…
ప్రభాస్ ‘రాముడి’గా, కృతీ ‘సీత’గా తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ రామాయణం ‘ఆదిపురుష్’. లాక్ డౌన్ కి ముందే కృతీ కొంత భాగం షూటింగ్ పూర్తి చేసింది. అయితే, ఇప్పుడు లాక్ డౌన్ పూర్తిగా ఎత్తివేయటంతో మరోసారి ‘ఆదిపురుష్’ సెట్స్ మీదకు చేరుకుంది మిస్ సనన్!

కృతీ ఖాతాలో ‘ఆదిపురుష్’ లాంటి ప్యాన్ ఇండియా మూవీనే కాక మరికొన్ని క్రేజీ సినిమాలు కూడా ఉన్నాయి. ఆమె ‘భేడియా’ అనే హారర్ సినిమాలో వరుణ్ ధవన్ సరసన నటిస్తోంది. ఆ సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా లాక్ డౌన్ ఎత్తేశాక, ఈ మధ్యే… కృతీ పూర్తి చేసింది. అలాగే, త్వరలో అక్షయ్ కుమార్ ‘బచ్చన్ పాండే’ సినిమా న్యూ షెడ్యూల్లో పాల్గొనబోతోంది. ‘మిమి, గణ్ పత్, హమ్ దో హమారే దో’ లాంటి సినిమాలు కూడా వివిధ దశల్లో ఉన్నాయి. రానున్న రోజుల్లో కృతీ కనీసం అర డజను చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించబోతోంది!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-