సర్కారు వారి పాట: అప్డేట్ అంటూ మరోసారి ఆగం చేసిన మైత్రి!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమా అప్డేట్ కోసం అభిమానులు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మొన్న సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్బంగా అప్డేట్ వస్తుందనుకున్న నిరాశే ఎదురైంది. అయితే తాజాగా సర్కారు వారి పాట చిత్రబృందం నుండి అధికారికంగా ఓ అప్డేట్ వచ్చింది. ‘సర్కారు వారి పాట షూటింగ్ మొదలైన వెంటనే అప్డేట్స్ ఇస్తామని తెలిపింది. అంతవరకూ అందరూ జాగ్రత్తగా ఉండండి’ అంటూ పిలుపునిచ్చారు. దీంతో ఏదో ప్రకటన వచ్చిందని చూసిన ఫ్యాన్స్ మరోసారి నిరాశ చెందారు. ఆమాత్రం దానికి అప్డేట్ అనటం ఎందుకు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు కొత్త లుక్ లో కనిపించనుండగా.. ఆయన సరసన కీర్తిసురేష్ కథానాయికగా నటిస్తోంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-