సూపర్ స్టార్ బ్యాక్ ఇన్ యాక్షన్!

సూపర్ స్టార్ మహేశ్ బాబు అభిమానులకు ఇవాళ పండగ రోజు. చాలా రోజుల గ్యాప్ తర్వాత ప్రిన్స్ మహేశ్ బాబు ‘సర్కారు వారి పాట’ షూటింగ్ లో పాల్గొన్నారు. తొలి షెడ్యూల్ దుబాయ్ లో జరిగిన తర్వాత మలి షెడ్యూల్ విషయంలో రకరకాల ప్లానింగ్స్ జరిగాయి. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా అవేవీ వర్కౌట్ కాలేదు. మొత్తం మీద కొద్ది రోజులుగా పరిస్థితులు చక్కదిద్దుకోవడంతో మహేశ్ బాబు ఈ రోజు సెట్ లోకి అడుగుపెట్టాడు. ఈ షెడ్యూల్ తొలి రోజున మహేశ్ కు దర్శకుడు పరశురామ్ సూచనలు ఇస్తున్న ఫోటోను చిత్ర నిర్మాతలు సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు.

read also : సీమకే కాదు ఉమ్మడి ఏపీకి అన్యాయం చేసింది చంద్రబాబే !

ఈ షెడ్యూల్ లో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారు. ఇంతకాలం అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టుగా ‘సర్కార్ వారి పాట’ షూటింగ్ విషయంలో రకరకాల వార్తలు నెట్టింట హల్చల్ చేశాయి. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే అభిమానులను ఆనందపరుస్తూ ఈ స్టిల్ ను నిర్మాతలు రిలీజ్ చేసినట్టు అర్థమౌతోంది. ఎస్. ఎస్. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేశ్ నాయికగా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్ టైన్ మెంట్, 14 రీల్స్ ప్లస్ సంయుక్తంగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ ను ప్రొడ్యూస్ చేస్తున్నాయి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-