‘బిజినెస్‌ మ్యాన్’ హంగామా… ఇంకా తగ్గని క్రేజ్

‘బిజినెస్‌ మ్యాన్’ విడుదలై పదేళ్లు పూర్తి కావస్తున్నా ఇంకా క్రేజ్ తగ్గలేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 2012 జనవరి 13న విడుదలైన ఈ సినిమాకు ఇప్పటికీ అద్భుతమైన స్పందన వస్తోంది ప్రేక్షకుల నుంచి. తాజాగా ఈ సినిమాతో మహేష్ బాబు ఖాతాలో మరో అరుదైన రికార్డు పడింది. మరో నాలుగైదు రోజుల్లో ఈ సినిమా విడుదలై పదేళ్లు పూర్తవుతుంది. ఈ సందర్భంగా మహేష్ అభిమానుల కోసం ‘బిజినెస్‌ మ్యాన్’ ప్రత్యేక షోలను ప్రదర్శిస్తున్నారు కొన్ని థియేటర్లలో.

Read Also : ఆర్జీవీ మరో సంచలన ట్వీట్

విశేషం ఏమిటంటే “బిజినెస్ మ్యాన్” స్పెషల్ షోలు చూసేందుకు మహేష్ బాబు అభిమానులు థియేటర్లకు వెళ్ళడానికి ఇప్పటికీ బాగా ఆసక్తిని కనబరుస్తున్నారు. దీంతో సూపర్‌స్టార్‌ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు 10+ షోలు ఏప్రిల్ 9న కన్ఫర్మ్ అయ్యాయి. అమలాపురంలో 3+ షోలు కాగా… మొత్తం 3 షోలు హౌస్‌ఫుల్ కావడం మరో విశేషం. టాలీవుడ్ చరిత్రలో ఇలా ఎప్పుడో విడుదలైన సినిమాకు ఒక సిటీలో 3 హౌస్‌ఫుల్ షోలు జరగడం ఇదే తొలిసారి. ఇక హైదరాబాద్ లోనూ కొన్ని థియేటర్లలో ‘బిజినెస్‌ మ్యాన్’ షోలు వేస్తున్నారు.

ఇటీవల కోవిడ్-19 బారిన పడిన మహేష్ ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఆయనకు ఈ సమయంలో మహేష్ బాబుకి ఇది సంతోషకరమైన వార్త అని చెప్పొచ్చు. ఆయన త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక మహేష్ సినిమా విషయానికొస్తే… “సర్కారు వారి పాట” సినిమా షూటింగ్ దశలో ఉంది. ఏప్రిల్‌ 1న విడుదల కానుంది. ఆ తరువాత త్రివిక్రమ్, రాజమౌళి వంటి స్టార్ డైరెక్టర్స్ తో మహేష్ బాబు ప్రాజెక్టులు ఉన్నాయి.

Related Articles

Latest Articles