బెస్ట్ మేకప్ మ్యాన్ అతనే… : మహేష్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా “బెస్ట్ మేకప్ మ్యాన్” అంటూ అతనికి కితాబిచ్చాడు. మహేష్ నుంచి ప్రశంసలు అందుకున్న ఆ మేకప్ మ్యాన్ ఎవరో తెలుసుకోవాలంటే సూపర్ స్టార్ ట్విట్టర్ కు వెళ్లాల్సిందే. “నాకు తెలిసిన వారిలో బెస్ట్ మేకప్ మ్యాన్ పట్టాభి. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ ఏడాది మీకు అద్భుతంగా ఉండాలి. మీ మీద ఎప్పటికి ప్రేమ, గౌరవం అలాగే ఉంటుంది” అంటూ తన మేకప్ మ్యాన్ పై అభిమానాన్ని కురిపించారు మహేష్. ఆయన ట్వీట్ చేసిన వెంటనే మహేష్ అభిమానులు పెద్ద ఎత్తున మేకప్ మ్యాన్ పట్టాభికి శుభాకంక్షాలు తెలుపుతూ సోషల్ మీడియా పేజీలు నింపేస్తున్నారు.

Read Also : సమంత ముంబైకి మకాం మార్చబోతోందా!?

కాగా మహేష్ బాబు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి పట్టాభినే ఆయనకు మేకప్ మ్యాన్ గా పని చేస్తున్నారు. గత ఏడాది కూడా సోషల్ మీడియా ద్వారా తన మేకప్ మ్యాన్ కు పుట్టినరోజు శుభాకంక్షాలు చెప్పారు మహేష్. కాగా ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా “సర్కారు వారి పాట” చిత్రం రూపొందుతోంది. ఇప్పుడు ఇది చిత్రీకరణ దశలో ఉంది. ఆ తరువాత మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూవీ ఉండనుంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-