మహేష్ అల్ట్రా మోడ్రన్ లుక్… పిక్ వైరల్

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ సినిమాతో బిజీగా ఉన్నారు. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇదిలా ఉండగా టాలీవుడ్ లో ఉన్న అందగాళ్ళలో సూపర్ స్టార్ స్టైల్, అందం వేరు. ఆయనంటే ఎంతోమంది మహిళా అభిమానులు పడి చచ్చిపోతుంటారు. హాలీవుడ్ హీరోలా ఉండే మహేష్ ను ఇప్పటికీ కలల రాకుమారుడిగా ఆరాధిస్తారు. తాజా ఫోటోషూట్ మరోసారి అదే నిరూపిస్తుంది. లేటెస్ట్ ఫోటోషూట్‌లో మహేష్ బాబు అల్ట్రా స్టైలిష్‌గా కనిపించాడు. ఆ పిక్ లో నల్ల ట్రౌజర్, ముదురు రంగు జాకెట్ ధరించి కనిపించాడు. ఆయన మోటర్‌ బైక్‌పై కూర్చుని మొబైల్ ఫోన్ పట్టుకుని ఉన్నాడు. ఇటీవల “సర్కారు వారి పాట” కోసం మార్చుకున్న హెయిర్‌స్టైల్‌ ను అలాగే మైంటైన్ చేస్తున్నాడు.

Read Also : సామ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… ఫస్ట్ ఇంటర్నేషనల్ మూవీ

మహేష్ బాబు కొత్త లుక్ చూస్తే వృద్ధాప్యం ఆగిపోయిందని మరోసారి రుజువు అవుతుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హాలీవుడ్ యాక్షన్ హీరోలకు ఏమాత్రం తీసిపోని ఈ 46 ఏళ్ల నటుడు చివరి సారిగా అనిల్ రావిపూడి ‘సరిలేరు నీకెవ్వరు’లో కనిపించాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘సర్కారు వారి పాట’లో కీర్తి సురేష్ మహిళా ప్రధాన పాత్రలో నటించింది. ఈ చిత్రం బ్యాంకింగ్ రంగంలో ఆర్థిక స్కామ్‌ల చుట్టూ తిరుగుతుంది. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు.

Related Articles

Latest Articles