డేవిడ్ వార్నర్‌పై హీరో మహేష్‌ బాబు ప్రశంసల జల్లు

టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా గెలుపులో ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ కీలకపాత్ర వహించాడు. 38 బంతుల్లో 53 పరుగులు చేసి ఆస్ట్రేలియాను గెలుపు వైపు తీసుకువెళ్లాడు. దీంతో డేవిడ్ వార్నర్‌ను అందరూ ప్రశంసిస్తున్నారు. ఈ జాబితాలో టాలీవుడ్ హీరో మహేష్‌బాబు కూడా ఉన్నాడు. నిజానికి వార్నర్‌పై ఈ ప్రపంచకప్‌లో ఎలాంటి అంచనాలు లేవు. ఎందుకంటే యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్‌లో అతడు రాణించలేదు. దీంతో సన్‌రైజర్స్ ఏకంగా జట్టు నుంచే వార్నర్‌ను తప్పించింది. ఈ పేలవ ప్రదర్శన వార్నర్‌లో మార్పు తెచ్చింది. ఇదే ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా జట్టుకు ప్లస్ పాయింట్‌గా మారింది.

Read Also: పోటీ నుండి తప్పుకున్న ‘గంగూబాయి’

‘టీ20 ప్రపంచకప్ ఛాంపియన్లుగా నిలిచినందుకు ఆస్ట్రేలియా జట్టుకు అభినందనలు… మిత్రమా డేవిడ్ వార్నర్ ఏమని చెప్పాలి నీ గురించి? నిజంగా నువ్వు లెజెండ్’ అంటూ హీరో మహేష్ బాబు కొనియాడాడు. టీ20 ప్రపంచకప్‌ను గెలవడం కోసం ఆస్ట్రేలియా జట్టుది ఎంతటి ఉక్కు సంకల్పమో అభిమానుల కళ్లకు కట్టినట్లు కనిపించిందన్నారు. మరోవైపు టీ20 ప్రపంచకప్‌లో ప్లేయర్ ఆఫ్ టోర్నమెంట్‌గా వార్నర్ నిలిచాడు. వార్నర్ ఈ టోర్నీలో 7 మ్యాచ్‌లు ఆడి 289 పరుగులు చేశాడు. కాగా వచ్చే ఐపీఎల్‌ సీజన్‌లో కొత్త ఫ్రాంచైజీకి వార్నర్ ప్రాతినిధ్యం వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Related Articles

Latest Articles