అందాల రాక్షసికి బంపర్ ఆఫర్… మహేష్ తో రొమాన్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. అతడు, ఖలేజా తర్వాత దర్శకుడు త్రివిక్రమ్‌తో మహేష్ చేస్తున్న హ్యాట్రిక్ మూవీ ఇది. “ఎస్ఎస్ఎంబి28” అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడిగా బుట్టబొమ్మ పూజాహెగ్డేను హీరోయిన్ గా తీసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ కు కూడా ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఆ స్థానంలో అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి మహేష్ తో రొమాన్స్ చేయనుందని అంటున్నారు. కథలో రెండవ హీరోయిన్ కు కూడా మంచి ప్రాధాన్యత ఉండడంతో మహేష్ సలహా కారణంగా లావణ్య త్రిపాఠిని ఈ ప్రాజెక్ట్ లో సెకండ్ హీరోయిన్ గా ఎంపిక చేశారట మేకర్స్.

Read Also : కంగనాపై చర్యలు… 91 ఏళ్ల స్వాతంత్ర్య సమరయోధురాలు డిమాండ్

ఈ వార్తలు గనుక నిజమైతే లావణ్య త్రిపాఠి, మహేష్ బాబు కలిసి పని చేయడం ఇదే మొదటిసారి. అలాగే టాప్ తెలుగు స్టార్‌తో కలిసి లావణ్య చేయబోయే మొదటి భారీ బడ్జెట్ చిత్రం కూడా ఇదే అవుతుంది. లావణ్య త్రిపాఠికి ఇది అద్భుతమైన ఛాన్స్ అనే చెప్పాలి. అందం, అభినయం ఉన్నప్పటికి లావణ్యకు ఇప్పటి వరకూ స్టార్ హీరోల సరసన నటించే అవకాశం రాలేదు. ప్రస్తుతం మహేష్ బాబు “సర్కారు వారి పాట”, త్రివిక్రమ్ శ్రీనివాస్ “భీమ్లా నాయక్”తో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాల కోసం వారు కోసం ఇచ్చిన కమిట్మెంట్స్ ను పూర్తి చేసి త్వరలో సెట్స్‌పైకి వెళ్లాలని భావిస్తున్నారు.

Related Articles

Latest Articles