బిజీబిజీగా మహేష్… దర్శకులతో వరుసగా చర్చలు

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన యాక్షన్ ఎంటర్టైనర్ “సర్కారు వారి పాట” సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ తరువాత వరుస ప్రాజెక్టులను లైన్ లో పెడుతున్నారు మహేష్ బాబు. ఈ మేరకు వరుసగా పలువురు దర్శకులతో చర్చలు కూడా జరుపుతున్నట్టు సమాచారం.

Read Also : ఈడీ ముందుకు తరుణ్… విచారణ స్టార్ట్

ఈ స్టార్ హీరో ఉత్తమ నటుడిగా అవార్డులు అందుకోవడానికి ఇటీవల జరిగిన రెండు అవార్డ్ ఈవెంట్‌లలో పాల్గొన్నాడు. ఒకటి ‘సైమా’ కాగా మరొకటి ‘సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్ 2021′. “మహర్షి’ సినిమాకుగానూ ఉత్తమ నటుడిగా మహేష్ బాబు అవార్డులు అందుకున్నారు. ప్రస్తుతం ఆయన పార్క్ హయత్‌లో కథ, క్యాజువల్ సిట్టింగ్‌లలో ఆరుగురు దర్శకులతో బిజీగా ఉన్నారని వినికిడి. “సర్కారు వారి పాట” దర్శకుడు పరశురామ్ తో కొన్ని సినిమా సన్నివేశాల గురించి సమావేశమయ్యారు. అదే సమయంలో త్రివిక్రమ్‌ని కూడా కలిశారు. మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కథపై వివరణాత్మక చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆ తరువాత ఉప్పెన డైరెక్టర్ బుచ్చి బాబుతో చర్చించిన మహేష్, గోపీచంద్ మలినేనిని సాధారణంగా కలిశారు. ఇంకా ‘అర్జున్ రెడ్డి’ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కూడా మహేష్ బాబును కలిశారు. సందీప్ రెడ్డి వంగా చాలాకాలం నుంచి మహేష్ బాబుతో సినిమా తీయాలని చూస్తున్న విషయం తెలిసిందే. వీరిలో పరశురామ్ తో ఆల్రెడీ మూవీ తెరకెక్కుతోంది. ఇక త్రివిక్రమ్ తో నెక్స్ట్ మూవీ ఉంది. మరి మిగిలిన వారిలో ఎవరెవరితో మహేష్ సినిమాలు చేయనున్నారో చూడాలి.

-Advertisement-బిజీబిజీగా మహేష్… దర్శకులతో వరుసగా చర్చలు

Related Articles

Latest Articles