రమేష్ బాబు అంత్యక్రియలకు మహేష్ బాబు ?

అలనాటి నటుడు, నిర్మాత, నటుడు కృష్ణ కుమారుడు, మహేష్ బాబు సోదరుడు జి. రమేష్ బాబు కాలేయ సంబంధిత వ్యాధితో నిన్న కన్నుమూశారు. 56 ఏళ్ళ వయసులోనే అనారోగ్యంతో ఆయన హఠాన్మరణం ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురి చేసింది. అంతిమ నివాళులర్పించేందుకు ఈరోజు ఉదయం 11 గంటల నుంచి రమేష్ బాబు పార్థివ దేహాన్ని పద్మాలయా స్టూడియోస్‌లో ఉంచనున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి. ఓమిక్రాన్ భయం మధ్య ఘట్టమనేని కుటుంబం తమ శ్రేయోభిలాషులు మరియు అభిమానులను కోవిడ్ -19 నిబంధనలను పాటించాలని అభ్యర్థించారు. దహన సంస్కారాల స్థలంలో కూడా గుమిగూడకుండా ఉండాలని కోరారు.

Read Also : మధ్యాహ్నం రమేష్‌ బాబు అంత్యక్రియలు..

ఇదిలా ఉండగా సోదరుడి అంత్యక్రియలకు మహేష్ బాబు హాజరవుతాడా ? లేదా ? అనే అనుమానం నెలకొంది అభిమానుల్లో. ఎందుకంటే మహేష్ బాబు కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉంటూ వైద్యుల సలహాలు పాటిస్తున్నారు. ఇటీవలే దుబాయ్ లో ఫ్యామిలీతో కలిసి దుబాయ్ లో న్యూఇయర్ ను సెలెబ్రేట్ చేసుకున్న ఆయన ఇక్కడికి రాగానే కోవిడ్ టెస్ట్ చేయించుకున్నారు. అందులో పాజిటివ్ అని నిర్ధారణ అయ్యిందంటూ మహేష్ బాబు స్వయంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే హఠాత్తుగా మహేష్ సోదరుడు కన్నుమూశాడు. కోవిడ్ కారణంగా రమేష్ బాబు అంత్యక్రియలకు మహేష్ బాబు హాజరుకాకపోవచ్చు.

Related Articles

Latest Articles