అన్నా గెట్ వెల్ సూన్… మహేష్ కు సెలెబ్రిటీల ట్వీట్స్

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం వారం రోజులు దుబాయ్ లో గడిపిన తర్వాత మహేష్ బాబు ఇటీవలే హైదరాబాద్ కు తిరిగి వచ్చారు. మహేష్, ఆయన కుటుంబం ఇక్కడికి వచ్చిన వెంటనే కోవిడ్ టెస్ట్ చేసుకున్నారు. అందులో మహేష్ బాబు టెస్ట్ రిజల్ట్స్ సానుకూలంగా వచ్చాయి. మహేష్ ఫ్యామిలీ మెంబెర్స్ కోవిడ్ టెస్ట్ రిజల్ట్స్ ఇంకా రావలసి ఉందని, మరికొన్ని గంటల్లో ఈ విషయం వెల్లడవుతుందని సమాచారం. ఇక మహేష్ నిన్న రాత్రి తనకు కోవిడ్ పాజిటివ్ అని నిన్న రాత్రి ప్రకటించినప్పటి నుంచి ఆయన అభిమానులతో పాటు ఎన్టీఆర్, సాయి ధరమ్ తేజ్ వంటి స్టార్స్ అంతా సూపర్ స్టార్ త్వరగా కోలుకోవాలని కోరుతూ సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ట్విట్టర్ లో “మహేష్ గెట్ వెల్ సూన్” అనే హ్యాష్ ట్యాగ్ వైరల్ అవుతోంది. మహేష్ ఫ్యామిలీతో దుబాయ్‌లో ఉన్నప్పుడు ఆయన భార్య నమ్రతా శిరోద్కర్ సోదరి, నటి శిల్పా శిరోద్కర్‌కు కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది.

Read Also : ఏపీ సీఎం జగన్ కు ఆర్జీవీ హెచ్చరిక

కాగా మహేష్ ఇప్పుడు దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న “సర్కారు వారి పాట”లో కీర్తి సురేష్‌ తో కలిసి స్క్రీన్ స్పేస్‌ను పంచుకోనున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి. మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎస్.థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. “సర్కారు వారి పాట” 2022 ఏప్రిల్ 1న విడుదల కానుంది.

Related Articles

Latest Articles