యూరప్‌లో ఫ్యామిలీతో మహేష్

ఆదివానం మా ఎన్నికలలో ఓటు వేయని స్టార్స్ లో మహేశ్ బాబు ఒకరు. ఆయన ఎందుకు ఓటు వేయలేదు అని ఆరా తీసింది ఎన్టీవీ ఎంటర్ టైన్ మెంట్. అయితే స్పెయిన్‌లో ‘సర్కారు వారి పాట’ చిత్రీకరణ పూర్తి చేసుకుని ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు. మహేశ్ యూరోప్ వెకేషన్ లో భాగంగా తన ఫ్యామిలీతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులకు ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ
వస్తున్నాడు. నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌లో గౌతమ్, సితారతో కలిసి తీసిన సెల్ఫీని షేర్ చేశారు. ఇక పిల్లలతో స్విమ్మింగ్ పూల్‌లో చిల్ అవుతున్న ఫోటోని మహేష్ షేర్ చేశాడు. ప్రస్తుతం స్విట్జర్లాండ్ లో ఫ్యామిలీతో ఉన్నాడు మహేశ్. మహేశ్ ఫ్యామిలీకి ఎంత ప్రాధాన్యత ఇస్తాడో అందరికీ తెలిసన విషయమే. ఏ చిన్న అవకాశం దొరికినా వెంటనే ఫ్యామిలీతో కలసి ట్రిప్ వేస్తుంటాడు మహేశ్. మహేశ్ నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ సంక్రాంతి 2022 కి విడుదల కానుంది. నవంబర్ కి ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి కానుంది. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ, 14 రీల్స్ ప్లస్, మహేష్ బాబు నిర్మిస్తున్నారు.

-Advertisement-యూరప్‌లో ఫ్యామిలీతో మహేష్

Related Articles

Latest Articles