‘హీరో’ అల్లుడికి మేనమామ మహేష్ విషెస్..

సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడిగా ఇండస్ట్రీకి పరిచయమవుతున్నాడు గల్లా అశోక్. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో హీరో చిత్రంతో గల్లా అశోక్ నటించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 15 న విడుదల కానుంది. గల్లా పద్మావతి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ చాలా ప్రామిసింగ్ గా ఉన్నాయి. ఇక నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లోను ప్రతి ఒక్కరు సినిమా బావుందని చెప్పడంతో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఇక తాజాగా ఈ సినిమాపై సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందించారు. ఒక వీడియో ద్వారా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ హీరో సినిమాకు బెస్ట్ విషెస్ తెలిపారు.

” హీరో సినిమా చూశాను.. నాకైతే విపరీతంగా నచ్చేసింది. నేనెప్పుడూ నమ్ముతాను.. కష్టపడితే మంచి ప్రతిఫలం వస్తుందని.. అశోక్ చాలా బాగా చేశాడు.. చాలా కష్టపడ్డాడు ఈ సినిమా కోసం.. ఆ కష్టం సినిమాలో కనిపిస్తుంది. నాన్నగారికి సంక్రాంతి చాలా కలిసొచ్చింది.. నాకు తెలిసి ఆయన నటించిన సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అయ్యి హిట్టు అందుకున్నాయి. అదే సెంటిమెంట్ నాక్కూడా వచ్చింది. ఒక్కడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సరిలేరు నీకెవ్వరూ ఇవన్నీ బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ఈ సంక్రాంతికి మా కుటుంబం నుంచి మరో హీరో పరిచయమవుతున్నాడు. నాన్నగారి అభిమానులు, నా అభిమానులు అశోక్ ని సపోర్ట్ చేస్తారని, ‘హీరో’ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకొంటున్నాను. ఇంకొకసారి హీరో చిత్ర బృందానికి అభినందనలు తెలుపుతున్నాను” అంటూ తెలిపారు. దీంతో గల్లా అశోక్ కి మేనమామ ఆశీస్సులు లభించినట్లే.. మరి రేపు రిలీజ్ అయ్యే ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Related Articles

Latest Articles