టీచర్స్ డే 2021 : చిరు, మహేష్ స్పెషల్ ట్వీట్స్

నేడు ఉపాధ్యాయ దినోత్సవం. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న భారతదేశంలో “టీచర్స్ డే”ను సెలబ్రేట్ చేసుకుంటారు. భారతదేశపు మొదటి ఉపరాష్ట్రపతి, దేశానికి రెండవ రాష్ట్రపతి అయిన సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈ రోజున జన్మించారు. డా. రాధాకృష్ణన్ పుట్టిన రోజును ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటాము. ఈ రోజు దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల్లో ఉపాధ్యాయులను గౌరవిస్తారు.

Read Also : “మా”లో విభేదాలు : బండ్ల గణేష్ అవుట్… ప్రకాష్ రాజ్ తో గొడవేంటి ?

కోరికలను నెరవేర్చమని దేవుడిని పూజించాలని, జ్ఞానాన్ని పొందడానికి గురువుకు సేవ చేయాలని పురాణ పురుషులు చెప్పిన మాట వాస్తవం. టీచర్ తన స్టూడెంట్ జీవితంలో నెలకొన్న అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానం అనే వెలుగును నింపుతాడు. గురువు అనేవాడు లేకపోతే జ్ఞానం ఉండదు. “టీచర్స్ డే”ను జరుపుకోవడం వెనుక ముఖ్య ఉద్దేశ్యం… ఉపాధ్యాయుల పట్ల తల్లిదండ్రులు, పిల్లలు గౌరవంగా వ్యవహరించాలి. అలాగే విద్యపై అవగాహన కల్పించడం కూడా. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు స్పెషల్ ట్వీట్స్ తో “టీచర్స్ డే” కొత్త అర్థాన్ని వివరించారు.

Related Articles

Latest Articles

-Advertisement-