‘మహా సముద్రం’ ఒడ్డున బ్యూటిఫుల్ పోస్టర్

‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న చిత్రం ‘మహాసముద్రం’.. శర్వానంద్ – సిద్ధార్థ్ మల్టీస్టారర్ గా నటిస్తున్న ఈ సినిమాలో అదితి రావు హైదరి – అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 14న థియేట్రికల్ రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్రబృందం తాజాగా సెకండ్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు. ‘చెప్పకే.. చెప్పకే…’ అనే సాంగ్ ని సెప్టెంబర్ 6న విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. సాంగ్ అనౌన్స్ మెంట్ సందర్భంగా ఓ బ్యూటిఫుల్ పోస్టర్ ని వదిలారు. చీర కట్టులో ఉన్న అదితి రావు హైదరి సముద్రపు ఒడ్డున కూర్చొని అందంగా కనిపిస్తోంది. జగపతి బాబు, రావు రమేష్, గరుడ రామ్ లు, కీలక పాత్రలు పోషిస్తుండగా.. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.

Image

Related Articles

Latest Articles

-Advertisement-