కొత్త వేరియంట్‌ టెన్షన్‌.. మహారాష్ట్ర కొత్త ఆంక్షలు..

ప్రపంచదేశాలను ఇప్పుడు కరోనా కొత్త వేరియంట్‌ కలవరపెడుతోంది.. సౌతాఫ్రికాలో వెలుగు చూసిన.. బీ 1.1.529 ప్రపంచ దేశాలకు విస్తరిస్తూ.. కునుకు లేకుండా చేస్తోంది.. బీ.1.1.529ను ఆందోళనర వేరియెంట్‌గా గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. ఈ కొత్త వేరియెంట్‌కు ‘ఒమిక్రాన్’ అనే పేరు పెట్టిన సంగతి తెలిసిందే కాగా.. ఈ మహమ్మారితో చాలా దేశాలు అప్రమత్తమై.. విదేశీ ప్రయాణికులపై ఆంక్షలు విధిస్తున్నాయి.. భారత్‌ కూడా అప్రమత్తం అయ్యింది.. మరోవైపు.. కోవిడ్‌ ఫస్ట్‌ వేవ్‌, సెకండ్‌ వేవ్‌.. ఇలా ప్రతీ సారి అత్యధిక కేసులు వెలుగు చూసిన మహారాష్ట్ర ముందస్తు చర్యలకు పూనుకుంది.

కొత్త వేరియంట్‌పై అప్రమత్తమైన మహారాష్ట్ర సర్కార్… ఆ రాష్ట్రానికి వచ్చేవారిపై ఆంక్షలు విధించింది.. రెండు డోసులు వేసుకున్నవారికే మహారాష్ట్రలోకి ఎంట్రీ ఉంటుందని స్పష్టం చేసింది. ఇక, 72 గంటల ముందు చేయించిన ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌ రిపోర్టుతోనే రావాలని నిబంధన పెట్టింది. సౌతాఫ్రికా నుంచి వచ్చినవారికి క్వారంటైన్‌ తప్పనిసరి అని స్పష్టం చేసింది మహారాష్ట్ర సర్కార్. మరోవైపు.. ఇతర రాష్ట్రాలు కూడా అప్రమత్తం అవుతున్నాయి.. ముందస్తు చర్యలకు పూనుకుంటున్నాయి.

Related Articles

Latest Articles