“మహా సముద్రం” మూవీ ట్విట్టర్ రివ్యూ !

“ఆర్ఎక్స్ 100” ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహించిన లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ “మహా సముద్రం”. ఇందులో శర్వానంద్, సిద్ధార్థ్, అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాతో సిద్దార్థ్ తొమ్మిదేళ్ల తర్వాత తెలుగులోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. “మహా సముద్రం” కమర్షియల్ అంశాలతో కూడిన ప్రేమ కథ. ఇక ఇప్పటి వరకు వచ్చిన ఈ సినిమా పోస్టర్లు, ఫస్ట్‌ లుక్స్ మరియు ట్రైలర్‌ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ వచ్చింది.

తాజాగా ఈ సినిమా ఇవాళ థియేటర్లలో విడుదలైంది. అయితే.. ఇవాళ విడుదలైన “మహా సముద్రం” మంచి టాక్‌ ను తెచ్చుకుంటోంది. ఈ సినిమా బాగుందంటూ ట్విట్టర్‌ లో నెటిజన్లు గోల గోల చేసేస్తున్నారు. ఈ మూవీ ఫస్టాఫ్‌ బాగానే ఉందని నెటిజన్స్‌ అభిప్రాయ పడుతున్నారు. అజయ్‌ భూపతి చెప్పినట్లు గానే చేతన్‌ భరద్వాజ్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ అదరగొట్టినట్టు నెటిజన్లు చెబుతున్నారు. ఇంటర్వెల్‌ ఫైట్ ఎపిసోడ్‌ ఈ సినిమా కు బాగా ప్లస్‌ అయిందని స్పష్టం చేస్తున్నారు. ఫస్టాఫ్‌ డీసెంట్‌ యాక్షన్‌, రొమాన్స్‌ లు కనిపించాయి. అలాగే మెయిన్‌ లీడ్‌ నటీ నటుల స్క్రీన్ ప్రెజెన్స్‌ అంతా కూడా బాగుందని చెబుతున్నారు నెటిజన్లు.

-Advertisement-"మహా సముద్రం" మూవీ ట్విట్టర్ రివ్యూ !

Related Articles

Latest Articles