మహాసముద్రం ట్రైలర్: మహా తుఫానుకు ముహూర్తం ఫిక్స్

టాలీవుడ్ హీరోలు శర్వానంద్ – సిద్ధార్థ్ మల్టీస్టారర్ గా రూపొందుతున్న చిత్రం ‘మహా సముద్రం’. అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అక్టోబర్ 14వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో మహాసముద్రం ట్రైలర్ విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ నెల 23వ తేదీన ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు.

అయితే ఈ సినిమా టైటిల్ తోనే ఆసక్తిరేకెత్తించగా.. యాక్షన్, ఎమోషన్స్ కూడా ఎక్కువే ఉండనున్నట్లు తెలుస్తోంది. అదితీ రావు, అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.. ముఖ్యమైన పాత్రల్లో జగపతిబాబు, రావు రమేశ్ నటిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతాన్ని అందించగా.. అనిల్ సుంకర నిర్మిస్తున్నారు.

Related Articles

Latest Articles