చైనా మ‌రో ఆవిష్క‌ర‌ణ‌: గంట‌కు 600 కిమీ వేగంతో…

చైనా మ‌రో కొత్త ఆవిష్క‌ర‌ణ‌కు తెర‌లేపింది.  గంట‌కు 600 కిమీ వేగంతో దూసుకుపోయో అత్యాధునిక మాగ్లెవ్ రైలును ఆవిష్క‌రించింది.  తూర్పు చైనాలోని షిడాంగ్ ప్రావిన్స్ కిండాన్ న‌గ‌రంలో ఈ స‌రికొత్త మాగ్లెవ్ సాంకేతిక‌త‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.  మాగ్లెవ్ ప్రాజెక్టును 2016లో ప్రారంభించ‌గా, మూడేళ్ల కాలంలో అయ‌స్కాంత‌-వాయుస్తంభ‌న ప్రోటోటైప్ రైలును 2019 లో ఆవిష్క‌రించారు.  ప‌ది భోగీల‌తో కూడిన ఈ రైలులో ఒక్కోభోగీలో 100 మంది చోప్పున ప్ర‌యాణం చేసే వీలుంటుంది.  మాములు చక్రాల మాదిరిగా కాకుండా ఈ రైళ్లు ప్ర‌యాణం స‌మ‌యంలో ప‌ట్టాల‌ను తాక‌కుండా ప్రయాణం చేస్తాయి.  దీంతో అత్యంత వేగం సాధ్యం అవుతుంది.  అంతేకాదు, రైళ్లు ప్ర‌యాణం చేసే స‌మ‌యంలో పెద్ద‌గా శ‌బ్దం కూడా రాద‌ని అధికారులు చెబుతున్నారు.  

Read: ‘మా’ కాంట్రవర్సీ : జైలుకెళ్ళాల్సిన వాళ్ళు… విష్ణు సంచలన ఆరోపణలు

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-