యూట్యూబ్ లో ఇద్దరు స్టార్ హీరోయిన్ల ఘాటు రొమాన్స్ .. వీడియో వైరల్

ప్రస్తుతం యువత ఆలోచనా విధానం మారుతోంది. తమకిష్టమైన వారితో, తమకిష్టమైన జీవితాన్ని జీవించాలని కోరుకుంటున్నారు. దీనికోసం ఎవరినైనా ఎదిరిస్తున్నారు.. చివరికి సమాజాన్ని కూడా.. ప్రేమకు లింగం అడ్డుకాదు.. గే అయినా, లెస్బెనియన్ అయినా వారి భావాలకు తగ్గట్టు ప్రేమించే హక్కు వారికి ఉంటుంది. ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం తప్పుకాదని న్యాయస్థానమే నిర్ణయించింది. అయినా సమాజంలో కొంతమంది వారిని అంగీకరించడంలేదు. అందులో సొంత తల్లిదండ్రులు కూడా పిల్లల భావాలను పట్టించుకోవడం లేదు.. తాజాగా ఇలాంటి ఒక కాన్సెప్ట్ తో కోలీవుడ్ హీరోయిన్లు సరేగమ తమిళ్ ఛానల్‌లో మాగిజిని పేరుతో ఒక మ్యూజిక్ వీడియో చేశారు. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్ ని షేక్ చేస్తోంది.

కోలీవుడ్ లో 96 చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న గౌరీ కిషన్, మరో హీరోయిన్ అనఘా ఇద్దరు లెస్బెనియన్ ప్రేమికులుగా కనిపించారు. చిన్నప్పటినుంచి అమ్మాయిలంటే ఇష్టం ఉండే వీరిద్దరూ భరతనాట్యం స్కూల్ లో కలుస్తారు. ఇద్దరు ప్రేమించుకుంటారు. సహజీవనం చేస్తారు.. వారి విషయం గౌరీ ఇంట్లో తెలిసి ఆమెను బయటకు గెంటేస్తాడు తండ్రి.. హాస్టల్ లో ఒంటరిగా ఉంటున్న అనఘాతో జీవితాన్ని పంచుకోవడానికి గౌరీ సిద్దమవుతుంది. ఇద్దరు కలిసి భరతనాట్యం ప్రోగ్రాం చేస్తారు.. అందులో వారి మనోభావాలను అందరికి అర్థమయ్యేలా చెప్తారు. దాంతో వారి బాధను అర్ధం చేసుకున్న పేరెంట్స్ వారికి ఏది ఇష్టమో అది చేయండి అంటూ పచ్చజెండా ఊపడంతో వీడియో ముగుస్తుంది.

సరేగమ తమిళ్ ఛానల్‌లో ఈ వీడియో విడుదలయింది. లెస్బియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్ జెండర్స్ పై అవగాహన కల్పించడానికే ఈ మ్యూజిక్ వీడియోను తెరకెక్కించినట్లు మేకర్స్ తెలుపుతున్నారు. ఇక ఈ వీడియోఫై నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.. దేవుడా.. తమిళ్ వాళ్ళు అమెరికా 2.0 చూపిస్తున్నారు అని కొందరు.. వాళ్లు ఏదైనా చేయగలరు అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు.

Related Articles

Latest Articles