మాజీ ఎంపి మాగంటి ఇంట విషాదం..

ఏలూరు మాజీ ఎంపి మాగంటి బాబు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. మాగంటి బాబు రెండవ కుమారుడు మాగంటి రవీంద్రనాద్ చౌదరి ( రవీంద్ర) మృతి చెందారు. ఈ ఘటన కాసేపటి క్రితమే జరిగినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే.. తాగుడు అలవాటును తప్పించడానికి రవీంద్రను ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో కుటుంబ సభ్యులు చేర్పించారు. కానీ వైద్యానికి నిరాకరించిన రవీంద్ర.. ఆసుపత్రి నుంచి తప్పించుకుని ఓ హోటల్ లో ఉన్నాడు. అయితే.. ఆయన ఆరోగ్యం క్షీణించి.. బ్లడ్ వామిటింగ్ కావడంతో హయత్ ప్యాలెస్ లోనే చనిపోయారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటన స్థలానికి చేరుకుని..మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. అంతేకాదు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు పోలీసులు. ఈ ఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-