‘మాస్ట్రో’ నుంచి మరో సాంగ్.. ఆకట్టుకున్న మహతి మ్యూజిక్

బాలీవుడ్ ప్రేక్షకులు మెచ్చిన ‘అంధదూన్’ సినిమాకి తెలుగు రీమేక్ గా ‘మాస్ట్రో’ వస్తున్న విషయం తెలిసిందే. నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా డిస్నీ హాట్ స్టార్ లో సెప్టెంబర్ 17వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. కథానాయికగా నభా నటేశ్ నటించగా, కీలకమైన పాత్రలో తమన్నా కనిపించనుంది. ఇప్పటికే విడుదల ట్రైలర్ లో నితిన్ అంధుడిగా అదరగొట్టగా.. తాజాగా ఈ సినిమా నుంచి మరో లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. ‘లా లా లా’ అని సాగే ఈ పాటలోని లిరిక్స్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. మహతి స్వరసాగర్ అందించిన మ్యూజిక్ ఆకట్టుకునే విధంగా వుంది. కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా, ధనుంజయ్ ఆలపించాడు. నికిత రెడ్డి – సుధాకర్ రెడ్డి నిర్మించారు.

Related Articles

Latest Articles

-Advertisement-