నితిన్ ‘మాస్ట్రో’ నుంచి ‘బేబీ ఓ బేబీ’ సాంగ్ ప్రోమో

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం ‘మాస్ట్రో’.. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నితిన్ జోడీగా నభా నటేశ్ నటిస్తోంది. ఓ కీలకమైన పాత్రలో తమన్నా చేసింది. హిందీలో సక్సెస్ అయిన ‘అంధాదున్’ సినిమాకి ఇది తెలుగు రీమేక్ గా వస్తుంది. శ్రేష్ఠ్ మూవీస్‌ పతాకంపై రాజ్‌ కుమార్‌ ఆకేళ్ళ సమర్పణలో ఎన్‌.సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ‘బేబీ ఓ బేబీ’ అంటూ సాగే పాట ప్రోమోను వదిలారు. పూర్తి పాటను రేపు ఉదయం 10:08 నిమిషాలకు విడుదల చేయనున్నట్టుగా తెలిపారు. మహతి స్వరసాగర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించగా.. శ్రీ జో సాహిత్యాన్ని అందించిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి ఆలపించాడు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-