‘సూరారై పోట్రు’ హిందీ రీమేక్ కు తొలగిన అడ్డంకి

సూర్య హీరోగా నటించిన ‘సూరారై పోట్రు’ చిత్రం తెలుగులో ‘ఆకాశమే నీ హద్దురా’గా విడుదలై చక్కని ఆదరణ పొందింది. థియేటర్లలో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా సూర్య ఓటీటీ స్ట్రీమింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అందులోనే జనం ముందుకు వచ్చింది. దాంతో ఇంటి డ్రాయింగ్ రూమ్ లోనే వాళ్ళు ఈ చిత్రాన్ని చూసి ఆనందించారు. ఈ సినిమాను హిందీలోనూ రీమేక్ చేయబోతున్నట్టు ఆ మధ్య సూర్య ప్రకటించాడు. తమిళ వర్షన్ ను డైరెక్ట్ చేసి సుధా కొంగర దీన్ని బాలీవుడ్ లో రీమేక్ చేస్తుందని తెలిపారు. కానీ తమిళ చిత్రానికి కో-ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన శిఖ్యా ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ఈ సినిమా హిందీ రీమేక్ పై కోర్టుకు కెళ్ళింది.

Read Also : నేడే “సీటిమార్” ప్రీ రిలీజ్ ఈవెంట్

‘సూరారై పోట్రు’కు తామూ నిర్మాతలమేనని, తమను సంప్రదించకుండానే హిందీ రీమేక్ కు సూర్యకు చెందిన 2డీ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ సిద్ధపడిందని ఆరోపించింది. ప్రాధమిక విచారణ అనంతరం హిందీ రీమేక్ షూటింగ్ పై మద్రాస్ హైకోర్ట్ ఇంజెక్షన్ ఆర్డర్ ఇష్యూ చేసింది. అయితే తాజాగా దానిని కోర్టు వెకేట్ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సూర్య బృందం హిందీలో ‘సూరారై పోట్రు’ను రీమేక్ చేయడానికి మార్గం సుగమం అయ్యింది. తమిళంలో సూర్య చేసిన కెప్టెన్ గోపీనాథ్ పాత్రను హిందీలో విద్యుత్ జమ్వాల్ చేయబోతున్నట్టు సమాచారం.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-