తమిళనాడు ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ

మద్రాస్ హైకోర్టు బుధవారం నాడు కీలక తీర్పును వెల్లడించింది. దివంగత సీఎం జయలలిత నివాసం వేద నిలయాన్ని స్మారక మందిరంగా మార్చడానికి వీల్లేదని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో గత ప్రభుత్వం(అన్నాడీఎంకే సర్కారు) జారీ చేసిన ఉత్తర్వులను న్యాయస్థానం కొట్టివేసింది. జయలలిత ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వానికి ఎలాంటి హక్కు లేదని కోర్టు వ్యాఖ్యానించింది. మూడు వారాల్లో వేద నిలయాన్ని జయలలిత మేనకోడలు దీప, మేనల్లుడు దీపక్‌కు అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది.

Read Also: షాకింగ్: సీనియర్ నటి జయసుధకు ఏమైంది..?

కాగా 2016లో జయలలిత మరణించగా.. ఆ మరుసటి ఏడాది జయ నివాసం పోయెస్ గార్డెన్‌ను అభిమానుల కోరిక మేరకు స్మారక మందిరంగా మార్చాలని అప్పటి పళనిస్వామి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జయలలిత మేనకోడలు, మేనల్లుడు కోర్టును ఆశ్రయించారు. వీరు దాఖలు చేసిన పిటిషన్‌ను బుధవారం మద్రాస్ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ మేరకు జయ నివాసం ఆమె మేనకోడలు, మేనల్లుడికి అప్పగించాలని కోర్టు సూచించింది.

Related Articles

Latest Articles