మద్రాస్‌ హైకోర్టులో హీరో విజయ్‌కి చుక్కెదురు

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్‌కి మద్రాస్‌ హైకోర్టు లక్ష రూపాయల జరిమానాతో షాకిచ్చింది. విజయ్ రోల్స్‌ రాయిస్‌ గోస్ట్‌ అనే రూ.8 కోట్ల ఖరీదైన కారును 2012లో ఇంగ్లాండ్‌ నుంచి దిగుమతి చేసుకున్నారు. ఈ కారుకు దాదాపు రూ.1.6 కోట్లను పన్నుగా చెల్లించాల్సి ఉంది. అయితే ఈ పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ హీరో విజయ్‌ 2021లో మద్రాస్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. కాగా, విజయ్ పిటిషన్ ను జస్టిస్ ఎస్ఎం సుబ్రమణియమ్ తోసిపుచ్చారు. విజయ్ లాంటి హీరోలు టాక్స్ ఎగ్గొట్టే ప్రయత్నాలు చేస్తే ఎలా అని కోర్టు ప్రశ్నించింది. విజయ్ కట్టే ఫైన్ ను కరోనా రిలీఫ్ ఫండ్ కోసం ఉపయోగించాలని ఆదేశించింది. కారు పన్నును రూ.1.6 కోట్లను రెండు వారాల లోపు చెల్లించాలని తీర్పునిచ్చింది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-